న్యూజిలాండ్​కు డ్రగ్స్ కొరియర్.. పార్సిల్ చేస్తుండగా హైదరాబాద్​లో పట్టుకున్న డీఆర్ఐ

న్యూజిలాండ్​కు డ్రగ్స్ కొరియర్.. పార్సిల్ చేస్తుండగా హైదరాబాద్​లో పట్టుకున్న డీఆర్ఐ

 హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ కు డ్రగ్స్ కొరియర్ చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులను డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌(డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) అరెస్టు చేసింది. వారి వద్ద 3 కిలోల ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకుంది. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో రూ.60 లక్షలు ఉంటుందని తెలిపింది. ఈ కేసుపై డీఆర్ఐ శనివారం ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ అవుతున్నట్టు తమకు సమాచారం అందిందని అందులో పేర్కొంది.

ఆ సమాచారంతో బేగంపేట్​లోని ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్ కార్గో కంపెనీలపై డీఆర్ఐ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 8న ఓ కొరియర్ కంపెనీ వద్దకు ఇద్దరు వ్యక్తులు రాగా, వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. వాళ్లు తెచ్చిన సూట్‌‌‌‌‌‌‌‌ కేసును తనిఖీ చేశారు.

దాని అడుగు భాగంలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పరెంట్‌‌‌‌‌‌‌‌ ప్లాస్టిక్ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్యాక్ చేసిన రెండు తెలుపురంగు పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తించారు. ఆ శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ను సేకరించి ల్యాబ్‌‌‌‌‌‌‌‌ కు పంపించగా, ఎఫిడ్రిన్ డ్రగ్‌‌‌‌‌‌‌‌గా నిర్ధారణ అయింది. దీంతో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని, నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. వాళ్లను శనివారం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.